📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

వడ్డెర బస్తీలో ఘనంగా దసరా వేడుకలు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
వడ్డెర బస్తీలో ఘనంగా దసరా వేడుకలు
  • జమ్మిచెట్టుకు పూజలు.. అలై బలైతో దసరా శుభాకాంక్షలు
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని వడ్డెర బస్తీలో దసరా పండుగ వేడుకలను వడ్డెర కులస్తులు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ అలై బలై చేసుకున్నారు. పరస్పరం దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ వారికుప్పల లింగయ్య, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ.. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. వడ్డెర కులస్తులందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ, తమ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. దసరా పండుగ సందర్భంగా ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఎట్టయ్య, సిద్దయ్యా, పెద్దులు, సత్తయ్య, మురళి, యాదయ్య, మల్లయ్య, సైదులు, వీరయ్య, వడ్డెర బస్తీకి చెందిన కులస్తులు, పెద్దలు, యువకులు పాల్గొని పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.