📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

రెండు దొంగతనాల కేసులను ఛేదించిన నిర్మల్ జిల్లా పోలీసులు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
రెండు దొంగతనాల కేసులను ఛేదించిన నిర్మల్ జిల్లా పోలీసులు
  • ఇద్దరు నిందితుల అరెస్ట్.. రూ.75 వేల విలువైన చోరీ సొత్తు, బైక్ స్వాధీనం
నిర్మల్ నవంబర్ 9 సాక్షర ప్రతినిధి. జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చోరీకి గురైన ఇత్తడి, వెండి వస్తువులతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 6వ తేదీ రాత్రి సారంగాపూర్ పాత బస్టాండ్ ప్రాంతంలో కందూరి రాజమణి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న ఇత్తడి, వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. అదే రాత్రి జాం గ్రామానికి చెందిన మనుకల రాజేశ్వర్‌కు చెందిన ప్యాషన్ ప్రో బైక్‌ను సైతం అపహరించారు.ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల ఐపీఎస్ ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ నేతృత్వంలో సారంగాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధారాలు సేకరించి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులు A1 సుగేందర్ (వైఎస్ఆర్ కాలనీ, నిర్మల్), A2 గబ్బర్ సింగ్ రాథోడ్ (ఆదిలాబాద్)లను సోమవారం అరెస్ట్ చేశారు.
స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు వివరాలు:
క్రైమ్ నంబర్ 144/2026, BNS 331(4), 305(a) సెక్షన్ల కింద నమోదైన కేసులో సుమారు రూ.20 వేల విలువైన ఇత్తడి వస్తువులు, వెండి మొలతాడు, వెండి కుంకుమ భరిణి స్వాధీనం చేసుకున్నారు.
క్రైమ్ నంబర్ 145/2026, BNS 305(b) సెక్షన్ కింద నమోదైన కేసులో సుమారు రూ.55 వేల విలువైన ప్యాషన్ ప్రో బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా సుమారు రూ.75 వేల విలువైన చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు.ఈ రెండు కేసుల ఛేదనలో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ జమీర్, కానిస్టేబుళ్లు మాధవ్, రవిలను నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్, జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల ఐపీఎస్ అభినందించారు.