📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

జిల్లాలో తక్షణమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి, నష్టపోయిన రైతులకు బోనస్ అందించాలి : బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి

◉ T PRAKASH RAO   |   ◷ Latest
జిల్లాలో తక్షణమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి, నష్టపోయిన రైతులకు బోనస్ అందించాలి : బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి
  • రైతులు తప్పని పరిస్థితుల్లో మధ్య దళారులకు, కమిషన్ ఏజెంట్లకు అమ్ముకుని సరైన ధర రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు. జిల్లాలో వరి ధాన్యం కోతలు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తప్పని పరిస్థితుల్లో మధ్య దళారులకు, కమిషన్ ఏజెంట్లకు అమ్ముకుని సరైన ధర రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారులకు ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వరి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి వెంటనే పూర్తిస్థాయిలో వారి ధాన్యం కొనుగోలను ఏర్పాటు చేయాలని అలాగే ప్రభుత్వం హామీ ఇచ్చిన బోనస్ ని వెంటనే అందించాలని ఆయన కోరారు.