📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

జన్నారంలో అంగరంగ వైబవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

◉ Kotha Venugopal   |   ◷ Latest
జన్నారంలో అంగరంగ వైబవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆదివారం రోజున సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని మండలకేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో ఈ పండుగను మహిళలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. మండలకేంద్రంలోని వాసవినగర్ లో ఏర్పాటుచేసిన భతుకమ్మ బావి వద్ద 8 రోజుల పాటు మహిళలు ప్రతిరోజు భతుకమ్మ కార్యక్రమాన్ని జరుపుకున్నారు చివరగా ఈరొజు 9 వ రోజు సద్దుల బతుకమ్మ నిమజ్జన కార్యక్రమం సందర్బంగా ప్రత్యేకంగా భతుకమ్మ లను ఆచారం ప్రకారం గునుక తంగేడి పులతోపాటు అనేక రకాల పూలతో చూడముచ్చటగా మంచిగా తయారుచేసుకొని చిన్న పెద్ద అందరు కలిసి సంతోషంగా సంబరంగా పండుగను జరుపుకున్నారు. సాంప్రదాయ బతుకమ్మ పాటలతోపాటు కోలాటం దాండియా నృత్యాలతో కన్నులపండుగగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. వాసవినగర్ వాసులు మహిలలకోరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు సర్వాంగ సుందరంగా ఈ ప్రాంగణాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.