- మానవత్వం చాటుకున్న మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్
- శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు
అమీన్‌పూర్ : ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తూ అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని లక్ష్మీ సాయి మెడోస్ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు తన సొంత నిధులతో నిర్మాణ పనులను ప్రారంభించారు. కాలనీలో డ్రైనేజీ సౌకర్యం సరిగా లేకపోవడంతో స్థానికులు కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను కాలనీవాసులు నందారం నరసింహ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. తన సొంత ఖర్చులతో డ్రైనేజీ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు నరసింహ గౌడ్‌కు ఘన స్వాగతం పలికి, శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. తమ సమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించారు
ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు మాట్లాడుతూ, డ్రైనేజీ సమస్యను నరసింహ గౌడ్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి, సొంత నిధులతో పనులు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన అందిస్తున్న సేవలను కాలనీవాసులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, కాలనీ ప్రముఖులు, స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter