- ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులతో కలిసి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను కలిసిన భాస్కర్ రెడ్డి
పటాన్‌చెరు: జయలక్ష్మి నగర్ ఫేజ్-2లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఇటీవల నిర్వహించిన మహా రుద్రాభిషేకం, పుష్పార్చన కార్యక్రమాలు విజయవంతంగా ముగియడంతో ఆలయ నిర్వాహకులు, మాజీ వార్డు మెంబర్ భాస్కర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులతో కలిసి పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన నాయకులకు, ఇతర సహకారదారులకు భాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సహాయ సహకారాలు అందించాలని ఆదర్శ్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, జయలక్ష్మి నగర్ ఫేజ్-2 కాలనీవాసులు, సర్కిల్ అధ్యక్షుడు పరమేష్ యాదవ్, కృష్ణ కాంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
— Vukkalkar VivekStaff Reporter