నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈర్ల రాజు ముదిరాజ్
- సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ మనందరి బాధ్యత
సుల్తాన్‌పూర్ గ్రామంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీరంగూడ గ్రామంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గండిగూడ, పటేల్‌గూడ గ్రామాలతో పాటు సూర్యోదయ కాలనీ, దుర్గా నగర్ కాలనీలకు చెందిన దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు ఆహ్వాన పత్రికలు అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తిభావం, సామాజిక ఐక్యతకు ప్రతీకలని అన్నారు. సనాతన ధర్మం ధర్మబద్ధమైన జీవనం, సేవాభావం, మానవత్వం, పరస్పర గౌరవం వంటి ఉన్నత విలువలను బోధిస్తుందని పేర్కొన్నారు. దుర్గామాత ఆరాధన స్త్రీశక్తికి, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా యువతలో భక్తిభావం, మన సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందుతాయని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అమీన్‌పూర్ మండలంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. అన్నదాన కార్యక్రమాలు సేవాభావానికి, మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా నాయకుడు కొండా లక్ష్మణ్, అమీన్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మండల నాయకులు శ్రావణ్, జనార్ధన్, రాజమలేష్, గోపి, మనోహర్ చౌదరి, రతన్ చౌదరితో పాటు బీజేపీ కార్యకర్తలు, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
