📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి .. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి కృషి ..
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్  ప్రత్యేక పూజలు
పటాన్చెరు పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఆరవ వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని..పూజలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. దేవాలయం అభివృద్ధికి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, దయానంద్ చారి, వెంకటేష్, రాజు, రామ్మోహన్, విశ్వకర్మ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.