📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

చెన్నూరులో భక్తిశ్రద్ధలతో ఘనంగా అగ్నిగుండాల మహోత్సవం

◉ Kodishetti Sathish   |   ◷ Latest
చెన్నూరులో భక్తిశ్రద్ధలతో ఘనంగా అగ్నిగుండాల మహోత్సవం
చెన్నూరు (సాక్షర):
చెన్నూర్ పట్టణంలోని నాయి బ్రాహ్మణ వీధిలో వెలసిన శ్రీమాతేశ్వరి దుర్గామాత మండపం వద్ద అమ్మవారి అగ్నిగుండాల మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్నుల పండువగా నిర్వహించారు.
ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం కణకణ మండే నిప్పుల గుండంపై భక్తులు "జై భవాని" అంటూ భక్తి పారవశ్యంతో నడిచారు. తెలీక చేసిన పాపాలు అగ్నితో దహింపజేయాలని, అమ్మవారి కృపతో తమ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ భక్తులు నిప్పుల గుండం నుంచి నడిచేందుకు పోటీపడ్డారు.
స్థానిక భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంతో వీధులన్నీ అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి.