📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

బడ్జెట్ ప్రతిపాదనలను ఖచ్చితమైన అంచనాలు వివరాలతో సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

◉ Kotha Venugopal   |   ◷ Latest
బడ్జెట్ ప్రతిపాదనలను ఖచ్చితమైన అంచనాలు  వివరాలతో సిద్ధం చేయాలి
                                                           జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల సాక్షర
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణలో భాగంగా అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఖచ్చితమైన అంచనాలతో, పూర్తి వివరాలతో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు లతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వ శాఖల వారీగా చేపట్టవలసిన అభివృద్ధి పనులు, నిర్వహణ పనులు, భూసేకరణ, విద్యుత్ ఛార్జీలు, ఇరిగేషన్ తదితర అవసరాలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను ఖచ్చితమైన అంచనాలతో సిద్ధం చేయాలని తెలిపారు. అన్ని శాఖలకు అవసరమైన నిధుల కేటాయింపులు, ప్రొవిజన్లకు సంబంధించిన వివరాలను తెలియజేయడంతో పాటు గ్రూపులలో కూడా షేర్ చేయడం జరిగిందని, సంబంధిత అధికారులు మరోసారి సమగ్రంగా పరిశీలించి ఏవైనా అంశాలు చేర్చవలసి ఉన్నా, ప్రతిపాదనలలో తప్పిపోయిన పనులు ఉన్నా వెంటనే వివరాలు సమర్పించాలని తెలిపారు. ప్రతి పనికి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరైన అంచనాలు రూపొందించాలని, అంచనా వ్యయం కంటే తక్కువ మొత్తంతో ప్రతిపాదనలు పంపించి తరువాత అదనపు నిధుల కోసం ఇబ్బందులు సృష్టించవద్దని సూచించారు. ఇరిగేషన్ శాఖలో ఈ తరహా సమస్యలు తలెత్తుతున్నాయని, భూసేకరణ వంటి పనులకు సంబంధించి భూమి విస్తీర్ణం, ప్రస్తుత మార్కెట్ విలువ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన అంచనాలు రూపొందించాలని తెలిపారు. బడ్జెట్‌లో అవసరమైన ప్రొవిజన్ ఉన్నప్పుడే సంబంధిత పనులకు టోకెన్ జనరేట్ చేసి తదుపరి ప్రక్రియ చేపట్టడం సాధ్యమవుతుందని, కాబట్టి ఏ అంశం కూడా ప్రతిపాదనలలో మిస్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పనులు పూర్తయ్యాక బడ్జెట్‌లో ప్రొవిజన్ లేదని, అవసరమైన అంశం మిస్ అయిందని తెలియజేస్తే సంబంధిత శాఖల నోడల్ అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించి గతంలో వచ్చిన విద్యుత్ ఛార్జీలను ప్రాతిపదికగా తీసుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తగిన అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అదనంగా చేర్చవలసిన అంశాలపై సంబంధిత అధికారులు తమ పేరుతో మెమోరాండం సమర్పించి, అవసరమైన ప్రతిపాదనలను జత చేయవచ్చని తెలిపారు. చెన్నూర్ గోదావరి పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా సమీక్షిస్తూ, ఇప్పటికే ఎడమవైపు ఘాట్‌కు మంజూరైన పనులు, మరమ్మతులు, ఇతర సదుపాయాలను పరిశీలించి, కుడివైపు ఘాట్‌కు సంబంధించిన అవసరాలను సమగ్రంగా అంచనా వేయాలని సూచించారు. గతంలో ఆమోదించిన అంచనాలలో పొందుపరిచిన పనులు, మిగిలిన పనుల వివరాలను స్పష్టంగా పరిశీలించాలని తెలిపారు. ఇరిగేషన్ శాఖలో మంచిర్యాల, చెన్నూర్ డివిజన్లకు సంబంధించిన అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని, జిల్లా స్థాయి ఇరిగేషన్ అధికారి 2 డివిజన్ల అధికారులతో సంప్రదించి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ముఖ్యమైన పనుల సమీక్షలకు సంబంధిత శాఖల బాధ్యతాయుతమైన అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని తెలిపారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల భద్రత, పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇప్పటికే ఉన్న నిర్మాణాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మరమ్మతులు, పటిష్టీకరణ పనులను గుర్తించాలని సూచించారు. పుష్కరాలు ప్రారంభమయ్యే సమయానికి ఘాట్లు సురక్షితంగా, వినియోగానికి అనువుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని పనులు, అవసరాలు, అదనపు ప్రతిపాదనలను మరోసారి పరిశీలించి అవసరమైన సమర్థనతో కూడిన వివరాలను వెంటనే సమర్పించాలని, సంబంధిత పనులన్నింటిపై సమగ్ర సమీక్ష నిర్వహించి ఈ నెల 14వ తేదీలోగా ప్రతిపాదనల ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు.