📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

గురు శ్రేష్ఠ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథులకు ఆహ్వానం

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
గురు శ్రేష్ఠ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథులకు ఆహ్వానం
  • నవంబర్ 14న నిర్వహించనున్న ప్రైవేట్ టీచర్స్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరుకావాలని టిఆర్ఎస్ ఎంఏ ప్రతినిధుల విజ్ఞప్తి
నిర్మల్ నవంబర్ 11 సాక్షర ప్రతినిధి. నిర్మల్ జిల్లాలో నవంబర్ 14వ తేదీన నిర్వహించనున్న ప్రైవేట్ టీచర్స్ అవార్డ్స్ కార్యక్రమం ‘గురు శ్రేష్ఠ’కు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ TRSMA (తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్) నిర్మల్ జిల్లా ప్రతినిధులు బుధవారం జిల్లా అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, నిర్మల్ డీఎస్పీ పెండం శ్రీనివాస్‌లను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ కార్యక్రమంలో TRSMA జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, టౌన్ అధ్యక్షులు అయ్యన్నగారి శ్రీధర్, టౌన్ జనరల్ సెక్రటరీ జి. శ్యామ్ ప్రకాష్, రాష్ట్ర ఈసీ సభ్యులు షబ్బీర్ అహ్మద్, సోన్ సక్సెస్ స్కూల్ కరస్పాండెంట్ అంబేకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నవంబర్ 14న నిర్వహించనున్న ‘గురు శ్రేష్ఠ’ కార్యక్రమం ప్రైవేట్ పాఠశాలల్లో విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయుల కృషిని గుర్తించి, వారి సేవలను గౌరవించే ఉద్దేశంతో నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహించడం ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉపాధ్యాయులను అభినందించి, వేడుకను విజయవంతం చేయాలని వారు కోరారు.