📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
23°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమాన
‹
›
District News

పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యం: RK ఫౌండేషన్ ఛైర్మన్ కాల్వగడ్డ రాజ్ కుమార్

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యం: RK ఫౌండేషన్ ఛైర్మన్ కాల్వగడ్డ రాజ్ కుమార్
  • ముత్తంగి డివిజన్‌-265 మున్సిపల్ కార్మికులకు దసరా కానుకల పంపిణీ
ముత్తంగి: పారిశుధ్య కార్మికుల సేవలు సమాజానికి అమూల్యమైనవని RKF ఫౌండేషన్ ఛైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కాల్వగడ్డ రాజ్ కుమార్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆదివారం వెలిమేలలోని తన నివాసంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముత్తంగి డివిజన్‌-265 మున్సిపల్ కార్మికులకు దసరా కానుకలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహిళా కార్మికులకు గద్వాల చీరలు, పురుష కార్మికులకు రేమండ్స్ వస్త్రాలతో పాటు ఒక్కొక్కరికి రూ.500 నగదును అందజేశారు. అనంతరం కాల్వగడ్డ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు నిత్యం ప్రజాసేవలో ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కార్మికులతో పండుగ సంతోషాలను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. పారిశుధ్య కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా RK ఫౌండేషన్ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పండుగ వేళ తమకు కానుకలు అందజేసిన కాల్వగడ్డ రాజ్ కుమార్‌కు మున్సిపల్ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.