అనాధ పిల్లలకు అండగా నిలిచిన తెలంగాణా గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి
జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు అనాధ పిల్లలకు తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అండగా నిలిచిందని సమితి వ్యవస్థాపకులు కల్లెడ భూమయ్య తెలిపారు. శుక్రవారం రోజున అయన మాట్లాడుతూ మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన ఓరగంటి లింగయ్య దివ్య దంపతులు అనారోగ్యంతో మృతిచెందడంతో వారి పిల్లలు అమూల్య స్పందన ఇద్దరు అనాదలు అయినారని ఈ విషయం తెలిసిన వెంటనే సమితి అద్వర్యంలో మా సబ్యుల సహకారంతో 93200/- రూపాయలను జమచేసి ఈ డబ్బులను పిల్లల పేరుపై బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందని అయన తెలిపారు. ఈరొజు సమితి అద్వర్యంలో పిల్లల వద్దకు వెళ్లి ఈ విషయాన్నీ వారికీ తెలిపి బవిష్యత్ లో మీకు విద్యతోపాటు అన్నిరకాలుగా మా సమితి సహకరిస్తుందని వారికీ బరోసా కల్పించడం జరిగిందని అయన అన్నారు. ఈ సహకారానికి ఇతర దేశాలలో వుండి సహకరించిన ఓరగంటి వెంకటేష్ సంతపురి రమేష్ కల్లెడ లచ్చయ్య పందిరి రాజేష్ కొండ్ర నారాయణ లతో పాటు ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికి సమితి తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అయన తెలిపారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ నూతి రామయ్య పెద్దలు అలుగునూరి పద్మారావు తదితరులు సమితి సబ్యుఅలను అబినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంతపురి రాజేష్ రేశానేని లచ్చన్న వెంకటేష్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
