📅 Saturday, 31 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS లేబర్ కోడులను రద్దుచేసి కార్మిక చట్టాలను అమలు చేయాలి.
‹
›
District News

భూమాత ఆరోగ్యాన్ని రక్షించుకుంటే అందరం ఆరోగ్యంగా వుంటాం ఏ ఓ వీరన్న

◉ Kotha Venugopal   |   ◷ Latest
భూమాత ఆరోగ్యాన్ని రక్షించుకుంటే అందరం ఆరోగ్యంగా వుంటాం ఏ ఓ వీరన్న
జన్నారం సాక్షర
ప్రతి ఒక్కరైతు భూమాత ఆరోగ్యాన్ని రక్షించుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటామని మండల వ్యవసాయాదికారి వీరన్న అన్నారు. శుక్రవారం రోజున మండలంలోని కొత్తపేట గిరిజన గ్రామంలో కేతి బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నేలను ఆరోగ్యంగా కాపాడుకుంటే నేలతల్లి మనందరినీ ఆరోగ్యంగా వుంచుకుంటుందని దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ అయన తెలిపారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు పురుగుమందులు అదికంగా వినియోగించడం వలన నేలలో మొక్కలకు పోషకాలు అందించే ఉపయోగకరమైన సుక్ష్మ జీవులు నశించే ప్రమాదం ఉంటుందని ఎరువులు యూరియా మోతాదుకు మించి వాడడంతో నెల సారవంతం తగ్గుతుందని అదేవిదంగా పంట అవశేషాలను కాల్చకూడదని అయన సూచించారు. ప్రతి ఒక్క రైతు పశువుల ఎరువులను వినియోగించాలని మా సిబ్బంది సూచనలు పాటించి భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవాలని అయన తెలిపారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గి భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నందున రైతులు నీటి వినియోగాన్ని తగ్గించే ఆరుతడి పంటలను పండించాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పవార్ దినేష్ నాయక్ ఏ ఈ ఓ బాదావత్ అఖిల్ ఉప సర్పంచ్ వార్డు సబ్యులు రైతులు పాల్గొన్నారు.