- గోలేటి సిహెచ్పి హెచ్ఓడి కోటయ్య.
రెబ్బెన,సాక్షర:నిత్యం సాధన చేసే క్రీడాకారులు క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారని గోలేటి సిహెచ్పి హెచ్ఓడి కోటయ్య అన్నారు.డబ్ల్యూపిఎస్ అండ్ జిఏ 93వ వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా శనివారం గోలేటిలోని శ్రీ భీమన్న క్రీడా మైదానంలో అథ్లెటిక్స్ పోటీలకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ క్రీడాకారులు ప్రతి దినం నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ సమిష్టిగా పోటీల్లో పాల్గొని కోల్ ఇండియా స్థాయిలో రాణించాలన్నారు.గతంలో పతకాలు సాధించిన సీనియర్ క్రీడాకారులను అభినందించారు.కార్యక్రమంలో ఏఐటియుసి నాయకుడు మారం శ్రీనివాస్,సీనియర్ పర్సనల్ అధికారి ఎం.శ్రీనివాస్,డబ్ల్యూపీఎస్ అండ్ జిఏ గౌరవ కార్యదర్శి డి.ప్రశాంత్,స్పోర్ట్స్ కోఅర్దినేటర్ కిరణ్ బాబు,జనరల్ క్యాప్టెన్ ఎస్కే అబ్బాస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER