📅 Saturday, 31 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
27°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహానుభావులు వల్లభ్ భాయ్ పటేల్ * నివాళులర్పించిన ఎంపి ధర్మ పూరి ఆర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్,
‹
›
District News

లేబర్ కోడులను రద్దుచేసి కార్మిక చట్టాలను అమలు చేయాలి.

◉ M VIJAYA   |   ◷ Latest
లేబర్ కోడులను రద్దుచేసి కార్మిక చట్టాలను అమలు చేయాలి.
  • ఏఐటియూసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగె ఉపేందర్.
రెబ్బెన,సాక్షర:ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం రెబ్బెన గ్రామ పంచాయతీ వద్ద ఏఐటియుసి మండల అధ్యక్షుడు రమేష్ జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ 1920లో ఆవిర్భవించిన ఏఐటీయూసీ దేశానికి పూర్తి స్వాతంత్ర్యం కావాలని పోరాటం చేసిన మొట్టమొదటి యూనియన్ అని అన్నారు.పోరాటాలతో సాధించుకున్న 44కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చిందన్నారు.వెంటనే కార్మిక వ్యతిరేక లేబర్ కోడులను రద్దు చేసి 44కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి జీవో నెం.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని,8గంటల పని విధానాన్ని అమలు చేసి కనీస వేతనం 26వేలు చెల్లించాలన్నారు.పిఎఫ్,ఈఎస్ఐ గ్రాట్యూటీ పై ఉన్న సీలింగ్ ను ఎత్తివేయాలని,కనీస పెన్షన్ 10వేలుఇవ్వాలిని,సివిల్ సప్లై హమాలీ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని,ఎన్ హెచ్ఎం ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు.ఆర్టిసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని,సింగరేణికి నూతన బొగ్గు బావులు కేటాయించాలని,ఆటో,హమాలీ వంటి అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు అమలు చేయాలన్నారు.విఒఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి,స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,ప్రతి నెల ఒకటో తేదీన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రెబ్బెన మండల కార్యదర్శి రత్నం దేవాజి,ఉపాధ్యక్షుడు శంకర్ సిబ్బంది లాలూ,సునీల్,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.