బీజేపీ మహా పాదయాత్రకు భారీగా తరలిరావాలి
- కాంగ్రెస్, ఇండీ కూటమి దుష్ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలి – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెడిసెమ్మ రాజు
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న ప్రచారాన్ని ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెడిసెమ్మ రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నవంబర్ 3న నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా శనివారం సోన్ మండల కేంద్రంతో పాటు సంగంపేట్, బొప్పారం, సోన్, గంజాల్, జాఫ్రాపూర్ గ్రామాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడిసెమ్మ రాజు మాట్లాడుతూ.. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి, వాస్తవాలను వివరించేందుకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశాల్లో సోన్ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, లింగగౌడ్, మాజీ ఎంపీపీ సరిగెల గంగన్న, హరీష్ రెడ్డి, సర్పంచులు విలాస్, గంగాధర్, నరేష్, రాజు, సోన్ ఉపసర్పంచ్ దాసరి రాజేశ్వర్, నాయకులు మల్లేష్, నవీన్, ముత్కపల్లి నరేష్, గడ్డం నర్సయ్య, అమృత్, రాజేశ్వర్, వెంకట్, నర్సయ్య, భీమ్రావు, లింబాద్రి, సత్యం, భూమారెడ్డి, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
