📅 Saturday, 31 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహానుభావులు వల్లభ్ భాయ్ పటేల్ * నివాళులర్పించిన ఎంపి ధర్మ పూరి ఆర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్,
‹
›
District News

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగించాలి.....

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను కొనసాగించాలి.....
  • సొన్ మండల కేంద్రంలో ఘనంగా ఉక్కు మనిషి జయంతి వేడుకలు.. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు
సోన్ అక్టోబర్ 31 సాక్షర దినపత్రిక
భారతదేశ ఐక్యత, సమగ్రతకు విశేష కృషి చేసిన ఉక్కు మనిషి, భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలో శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ ఐక్యత కోసం పటేల్ చేసిన సేవలను, స్వాతంత్ర్యానంతరం సంస్థానాల విలీనంలో పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సోన్ మండల బీజేపీ అధ్యక్షుడు మార గంగారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మెడిసెమ్మ రాజు, లింగగౌడ్, సరిగెల గంగన్న, హరీష్ రెడ్డి, సర్పంచులు నరేష్, విలాస్, గంగాధర్, నాయకులు ముత్కపల్లి నరేష్, మల్లేష్, నవీన్, గడ్డం నర్సయ్య, రాజేశ్వర్, అమృత్, వెంకట్, నర్సయ్య, పోశెట్టి, సత్యం, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.