- నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి పటేల్ కీలక పాత్ర
సాక్షర, నిజామాబాద్ ప్రతినిధి, అక్టోబర్ 31: జాతీయ ఐక్యత కోసం కృషి చేసిన మహానుభావులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం నగరంలోని వర్ని చౌరస్తాలో గల విగ్రహానికి ఎంపి ధర్మ పూరి ఆర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్, పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 562 సంస్థాలను విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దేశ సమగ్రత ఐక్యతకోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తి దాయకమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్ లో ప్రపంచంలోనే ఎత్తైన " స్టాచ్యూ ఆఫ్ యూనిటీ " పటేల్ విగ్రహాన్ని నిర్మించి ఘనమైన నివాళి అందించారన్నారు. అలాగే నిజాం నిరంకుశ పాలనకు ముగింపు పలికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి పటేల్ కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
ప్రధానంగా 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంలో ఆపరేషన్ పోలో ప్రారంభించి, సెప్టెంబర్ 17న నిజాం లొంగుబాటు ప్రకటించడంతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు కల్పే అర్చనా చిరంజీవి, జగదీష్ కులకర్ణి, మల్కాయి మహేందర్, మఠం పవన్, న్యాలం సునీత రాజు తదితరులు పాల్గొన్నారు.
— T PRAKASH RAONizamabad Dist Staffer