📅 Friday, 30 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం చేపట్టాలి
‹
›
District News

ఉపాధి హామీ పనులతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
ఉపాధి హామీ పనులతో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
  • జాబ్ కార్డుదారులందరికీ ఉపాధి కల్పించాలి.. గ్రామాల్లో నీటి సంరక్షణ నిర్మాణాలు విస్తృతంగా చేపట్టాలి – జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ అక్టోబర్ 30 సాక్షర ప్రతినిధి
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు నీటి వనరుల సంరక్షణకు విస్తృత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. విబిజి రామ్ జీ పథకం కింద చేపట్టే పనులను సమర్థవంతంగా అమలు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం లోకేశ్వరం మండలంలోని అర్లి–గొడిసెర గ్రామంలో కలెక్టర్ పర్యటించి పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాబ్ కార్డులు కలిగిన కూలీలందరూ ఉపాధి పనుల్లో పాల్గొనేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టి ప్రజలకు పని కల్పించాలన్నారు.అనంతరం గ్రామంలో స్వాధ్యాయి వృక్ష మందిరం ఏర్పాటుకు స్థలం కేటాయింపు అంశంపై స్థానికులతో కలెక్టర్ చర్చించారు. వృక్ష మందిరం కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సంబంధిత వ్యక్తులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లీజు తదితర మార్గాల ద్వారా వృక్షాల పెంపకానికి స్థలం కేటాయించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రతిపాదిత స్థలాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్, ఆ ప్రాంతంలో గ్రావెల్, స్టోన్ మెటీరియల్ నిల్వలు ఉన్నాయా అనే విషయాన్ని మైనింగ్ శాఖ అధికారుల ద్వారా నిర్ధారించి వివరాలు సేకరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యారావు, సర్పంచ్ జంగం ప్రసన్న, గ్రామస్తులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.