📅 Friday, 30 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి.
‹
›
District News

చలో ఢిల్లీకి తరలిన నిర్మల్ కాంగ్రెస్ శ్రేణులు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
చలో ఢిల్లీకి తరలిన నిర్మల్ కాంగ్రెస్ శ్రేణులు
  • ఓటు బచావో.. దేశ్ బచావో నినాదంతో ఢిల్లీలో నవంబర్ 1న భారీ నిరసన కార్యక్రమం జెండా ఊపి ప్రత్యేక బస్సును ప్రారంభించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు
నిర్మల్ అక్టోబర్ 30 సాక్షర ప్రతినిధి
ఓటు బచావో.. దేశ్ బచావో నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు నేతృత్వంలో ప్రత్యేక బస్సులో ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు జెండా ఊపి బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్నారని తెలిపారు. ఓటు హక్కు పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల కాపాడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఓటు చోరీ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలదీస్తామని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తుందని శ్రీహరిరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.