నూతన సీ.ఐ మహేష్ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నిజాముద్దీన్ బాబా.
- మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ ఇస్నాపూర్ నూతన పోలీస్ స్టేషన్ సీఐ టి. మహేష్‌ను ఇస్నాపూర్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ నిజాముద్దీన్ బాబా మర్యాదపూర్వకంగా కలిశారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సీఐకి శాలువా కప్పి ఘనంగా సన్మానించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మహేష్‌తో పరిచయం చేసుకుని, ప్రజలు మరియు ఆటో కార్మికులకు సంబంధించిన స్థానిక అంశాలపై మర్యాదపూర్వకంగా చర్చించారు. ప్రజలందరికీ దీపావళి పండుగ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను అందించాలని నిజాముద్దీన్ బాబా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకా ఏళ్లమ్మ తల్లి ఆటో యూనియన్ సభ్యులు డి. రాము, రాజు, సత్వేల్, అనిల్, లక్ష్మణ్, ఏడుకొండలు, లింగం, జంగయ్య, చిన్న, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
