పండుగ వేళ మున్సిపల్ కార్మికులకు అండగా జనార్దన్ రెడ్డి
- కొల్లూరులో మున్సిపల్ కార్మికులకు చీరలు, ఆర్థిక సహాయం పంపిణీ
మాజీ వార్డు మెంబర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను వార్డు మెంబర్‌గా ఉన్నప్పటి నుంచి గత పది సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులకు సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పారిశుధ్య కార్మికులు చేసే సేవలు ఎంతో విలువైనవని, వారు లేకపోతే పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోతాయని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే కార్మికులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భవిష్యత్తులోనూ తన సహాయ సహకారాలు కార్మికులకు ఎల్లప్పుడూ ఉంటాయని, మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని జనార్దన్ రెడ్డి తెలిపారు.
