రామచంద్రపురంలో తాగునీటి కష్టాలు.. పైపులైన్ మరమ్మతుల్లో జాప్యం!
- పైపులైన్ పగిలి నీటి సరఫరాకు అంతరాయం.. పట్టించుకోని వాటర్ వర్క్స్ సిబ్బంది?
- వేసవికి ముందే నీటి ఎద్దడి ఉంటే.. రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి?
తాగునీటి కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు, వాటర్ వర్క్స్ సిబ్బంది వెంటనే స్పందించి పగిలిన పైపులైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
వేసవికాలం రాకముందే తాగునీటి సమస్య ఎదురవుతుండటంతో, రానున్న ఎండాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.
