నీటి సంరక్షణపై చిన్నారుల అవగాహన ర్యాలీ
- నీరు అమూల్యం.. ప్రతి నీటి బొట్టును పొదుపు చేయాలి అంటూ విద్యార్థుల సందేశం
ఈ సందర్భంగా విద్యార్థులు నీటి పొదుపును సూచించే ప్లకార్డులు చేతబట్టి కాలనీలో ర్యాలీ చేపట్టారు. ‘నీరు అమూల్యం.. వృథా చేయొద్దు’, ‘ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోండి’ అంటూ నినాదాలు చేశారు. జలవనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు నీటి కొరత ఏర్పడకుండా ఇప్పటి నుంచే నీటి సంరక్షణకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చిన్నారులు జల యోధులుగా మారి నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంది. నీటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్, వినయ్, సోషల్ యాక్టివిటీ ప్రతినిధి అరుణ, త్రివేన్ కుమార్, ప్రవీణ్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
