📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

ప్రతి కార్యకర్త పార్టి అబివృద్దికి కృషి చేయాలి

◉ Kotha Venugopal   |   ◷ Latest
ప్రతి కార్యకర్త పార్టి అబివృద్దికి కృషి చేయాలి
జన్నారం సాక్షర :జన్నారం మండలంలోని కాంగ్రెస్ పార్టి ప్రతి నాయకులు కార్యకర్త పార్టి అబివృద్దికి కృషి చేయాలి అని పార్టి మండలశాఖ అద్యక్షులు అజ్మీర నందునయాక్ అన్నారు. శుక్రవారం రోజున మండలకేంద్రంలోని పార్టి కార్యాలయంలో మండల పార్టి సర్వసబ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అద్యక్షత వహించిన అయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అబివృద్ది కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నదని మండలంలోని ప్రతి పార్టి కార్యకర్త నాయకులు అందరు రాష్ట్ర ప్రభుత్వ సంస్ఖేమ పథకాల వివరాలను మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటింటికి చేరవేయాలని గత పాలకులు చేసిన ప్రజావ్యతిరేక పనులను చూపిస్తూ మన ప్రభుత్వ చేస్తున్న ప్రజా సేవ అబివృద్ది పనులను వివరంగా చెప్పాలని అయన సూచించారు. మండలంలోని ప్రజల సమస్యలు గ్రామాలలోని సమస్యలు పరిష్కరిస్తూ పార్టి అబివృద్దికి కృషి చేయాలనీ అయన తెలిపారు. ఈ సందర్బంగా ఇటివల మంజూరి అయిన ముఖ్యమంత్రి సహయనిది చెక్కులను లబ్దిదారులకు అందించారు. మండల కమిటి సబ్యులను కార్యకర్తలు సన్మానించారు. ఈ సమావేశంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అద్యక్షులు సోహెల్ షా పట్టణ అద్యక్షులు మంద రాజేష్ మండల ప్రధాన కార్యదర్శులు మేకల మాణిక్యం హేమంత్ చారి ఆడాయి హన్మంతరావు ఉపాధ్యక్షులు కండ్లె చంద్రయ్య ఆకుల సత్యనారాయణ కార్యదర్శులు రవినాయక్ పాపగౌడ్ మల్క లక్ష్మణ్ గౌడ్ జాడి రాజేశ్వర్ పద్మారావు నాయిని రమేష్ గౌడ్ సబ్యులు ఏం డి అజహర్ మర్రిపెల్లి చెంద్రయ్య లకావత్ తిరుపతి కోడిజుట్టు రాజన్న చుంచు నర్సయ్య రాహుల్ తదితరులు పాల్గొన్నారు.