📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
23°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమాన
‹
›
District News

భూ రీ-సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

◉ Kotha Venugopal   |   ◷ Latest
భూ రీ-సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల సాక్షర
భూ రీ-సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన, సర్వే ప్రక్రియ అమలు, సర్వే పనులలో పారదర్శకత, ఖచ్చితత్వం తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భూ రీ-సర్వే ప్రక్రియను సమర్థవంతంగా, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, తాండూర్ మండల తహసిల్దార్ జ్యోత్స్న లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి తాండూర్ మండల పరిధిలో చేపట్టిన భూ రీ-సర్వే పనుల పురోగతి, భూభారతి పథకం క్రింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై సమగ్రంగా సమీక్షించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. రైతులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు భూ రికార్డులకు సంబంధించిన సమస్యలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిష్కరించాలని తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా భూ రీ-సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, రైతులకు, ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.