📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
24°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
District News

నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డు భూ కబ్జాపై చర్యలు తీసుకోవాలి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
నిర్మల్ వ్యవసాయ మార్కెట్ యార్డు భూ కబ్జాపై చర్యలు తీసుకోవాలి
  • కూల్చివేసిన ప్రహరీ గోడ, స్లాబ్‌ను తిరిగి నిర్మించాలి. బీజేపీ కిసాన్ మోర్చా, బీజేపీ నాయకులు ,రైతుల డిమాండ్.
నిర్మల్ అక్టోబర్ 15 (సాక్షర ప్రతినిధి): నిర్మల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును బీజేపీ నాయకులు సందర్శించారు. మార్కెట్ యార్డు ప్రహరీ గోడను కూల్చివేసి, ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారనే నేపథ్యంలో పరిశీలించారు.. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అండదండలతో మార్కెట్ యార్డుకు సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీజేపీ నాయకులు, మరియు రైతులు ఆరోపించారు. ప్రస్తుతం అదే స్థలంలో ప్రైవేటు వ్యక్తి నిర్మాణ పనులు చేపడుతూ మార్కెట్ యార్డు ప్రహరీ గోడతో పాటు స్లాబ్‌ను సైతం కూల్చివేసి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు.ఈ వ్యవహారంపై మార్కెట్ కమిటీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోకపోవడం విచారకరమని బీజేపీ నాయకులు మరియు రైతులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. భూకబ్జాదారులని రిమాండ్ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డుకు సంబంధించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.అలాగే కూల్చివేసిన ప్రహరీ గోడ, స్లాబ్‌ను సంబంధిత అధికారుల పర్యవేక్షణలో తిరిగి నిర్మించాలి.మార్కెట్ యార్డు భూమిని పరిరక్షించి, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలి.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారుల తీరుపై ఉన్నతాధికారులు విచారణ జరపాలి.ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్, తక్కల రమణ రెడ్డి, దొడ్డికింది ముత్యం రెడ్డి, మేడిసేమ్మ రాజు, సాదం అరవింద్, సామ రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపె విలాస్, బీజేవైఎం నిర్మల్ జిల్లా అధ్యక్షులు దొడ్డికింది నిరంజన్ రెడ్డి, నిర్మల్ పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, కౌన్సిలర్లు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.