తపాలాపూర్ వద్ద రైతుల రాస్తారోకో బారిగా నిలిచిన వాహనాలు
జన్నారం మండలంలోని తపాలాపూర్ వద్ద ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సోమవారం రోజున సాగునీటి కొరకై తపాలాపూర్ గ్రామ రైతులు లక్షెట్టిపేట జన్నారం ప్రధాన రహదారిపై బైటాయించారు. ఈ సందర్బంగా బారాసా నాయకులు కమ్మల విజయదర్మ నైనాల తిరపతి సుశీల లు మాట్లాడుతూ కడెం ఆయకట్టు నుండి చివరిపంట వరకు సాగునీరు అందించాలని పంటలు చివరిదశకు వచ్చిన సమయంలో నీటిని నిలిపివేయడం సరైన పద్ధతి కాదని వారు అన్నారు. ఈ విషయంలో అధికారులను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెపుతున్నారని తొందరగా నీరు అందకుంటే పొలాలు పూర్తిగా పోతాయని దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం వున్నదని అధికారులు ప్రజాప్రతినిదులు కాస్తంత రైతుల కష్టాలపై దృష్టిసారించి సాగునీరు చివరి పంటవరకు అందేలా చూడాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు యువకులు ప్రజలు తరలి రావడం ఏం ఎల్ ఏ ఇక్కడ రావాలని సాగునీరు వెంటనే విడుదల చేయాలనీ అంతవరకూ నిరసన విరమించేది లేదని భీష్మించుకొని ఉండడంతో మంచిర్యాల ఏసిపి ప్రకాష్ అక్కడకు చేరుకొని రైతులను సముదాయించి ఈ సమస్యను ఉన్నతాదికారుల దృష్టికి తీసుకేలతామని ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారికీ తెలుపడంతో రైతులు రాస్తారోకో విరమంచారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు యువకులు ప్రజలు పాల్గొన్నారు.
