📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు

◉ Kotha Venugopal   |   ◷ Latest
ఇందిరమ్మ ఇంటిలో దీపావళి సంబరాలు
జన్నారం సాక్షర
జన్నారం మండలంలోని ఇందిరమ్మ ఇండ్లల్లో దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం రోజున దీపావళి పండుగను పురస్కరించుకొని పోనకల్ సర్పంచ్ జక్కు సుష్మబూమేష్ గ్రామ పంచాయితి పాలకవర్గంతో కలిసి పంచాయితీలోని ఇందిరమ్మ ఇంటి యజమానులు అయిలవేణి సత్య నర్సయ్య కుటుంబ సబ్యులతో కలిసి వారి ఇంటి వద్ద టపాసులు కాల్చి దీపావళి పండుగ సంబరాలను జరుపుకున్నారు.సర్పంచ్ దంపతులు ఇందిరమ్మ ఇంటి కుటుంబానికి నూతన వస్త్రాలు అందజేసి మిటాయిలు పంచిపెట్టారు. అదేవిదంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవెంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఖానాపూర్ ఏం ఎల్ ఏ ఆదేశాలమేరకు ఈరొజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అబివ్రుద్దికోరకు అహర్నిశలు కృషి చేస్తున్నదని ఆమె అన్నారు. గూడులేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తున్నదని ఆమె తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పతకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పార్టి నాయకులు కార్యకర్తలు కృషి చేస్తున్నారని ప్రజల అబివ్రుద్దె ప్రజా ప్రభుత్వ ద్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోనకల్ మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ ఉప సర్పంచ్ అప్పాల జలపతి కార్యదర్శి రాహుల్ వార్డు సబ్యులు మోషిన్ ఖాన్, ధుమ్మల ప్రవీణ్, బండెల ప్రేమ గ్రామ పంచాయితి బిల్ కలెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.