📅 Friday, 23 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
23°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇందూరులో 'హనుమాన్ కథ' ప్రవచన వైభవం అద్భుతం.. : అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
‹
›
Politics

పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు

◉ ELUGU VAMSHIDHAR   |   ◷ Latest
పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు
  • పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంపై చర్చ
ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి నివాసంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్ గారు, మాజీ ఎంపీ సోయం బాపురావు గారు, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డిభోజా రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, కార్యకర్తల సంక్షేమం తదితర అంశాలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో వారు చర్చించారు.

అదేవిధంగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై కూడా చర్చించారు.

ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చేలా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరువ చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.