📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
23°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమాన
‹
›
District News

జిల్లా లో ప్రైవేట్ పాఠశాలలో అనుమతులు లేకుండా మినీ వసతి గృహాలు నడిపిస్తున్న యాజమాన్యం.

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
జిల్లా లో ప్రైవేట్ పాఠశాలలో అనుమతులు లేకుండా మినీ వసతి గృహాలు నడిపిస్తున్న యాజమాన్యం.
  • అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పేరిట అధిక ఫీజులు వసూలు........
నిర్మల్ అక్టోబర్ 15(సాక్షర ప్రతినిధి):నిర్మల్ జిల్లా కేంద్రం తో పాటు జిల్లాలోనీ ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్భయంగా యాజమాన్యం మినీ వసతి గృహాలను నడిపిస్తున్నారు. పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మినీ వసతి గృహం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న వసతి గృహానికి సంబంధించి విద్యాశాఖ నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. అనుమతులు లేవని తెలిసినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా, పాఠశాల యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తోందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలో నిర్వహిస్తున్న మినీ వసతి గృహంపై విద్యాశాఖ అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కొందరి విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు కోరుతున్నారు. అలాగే ఫీజుల వసూళ్లపై కూడా అధికారులు స్పష్టమైన విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.పాఠశాలలో ఆటస్టలాలు లేక పోవడం తో విద్యార్థులు దారిన ఆటల పోటీ లో పాల్గొనలేక పోతున్నారు.కేవలం చదువులకే అంకితమౌతున్నారు.పాఠశాలకు అనుమతులు జారీ చేసే ముందు అన్ని విధాల చూసి అనుమతులు ఇవ్వాలని ప్రజలు,పోషకులు కోరుతున్నారు.
జిల్లా విద్యాధికారి డి భోజన్న వివరణ................
ఈ విషయంపై జిల్లా విద్యాధికారిని ఫోన్ ద్వారా సంప్రదించగా,జిల్లాలోని పాఠశాలలో,నిర్మల్ పట్టణంలోని,ప్రైవేట్ పాఠశాలలో నిర్వహిస్తున్న మినీవసతి గృహాలకు జిల్లా విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న కరాకండిగా తెలిపినారు. వాళ్ళు నిర్వహిస్తున్న మినీ వసతి గృహాలను వాళ్ళ సొంత నిర్ణయాల మేరకు (ఓన్ రిస్క్) పై నడుపుకుంటున్నట్టు తెలియజేసినారు. పాఠశాలలో నిర్వహిస్తున్న మినీ వసతి గృహాలకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏది ఏమైనా వారే బాధ్యులనీ సూచించారు.