📅 Thursday, 05 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
28°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS ఇసుక టిప్పర్ ను పట్టుకున్న అటవీ అధికారులు
‹
›
District News

గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటు
  • ఆర్‌ఎస్‌ఈటీఐ ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్ నవంబర్ 05 సాక్షర ప్రతినిధి
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామ సమీపంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఏర్పాటుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.గురువారం ఆయన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని సందర్శించి, శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనువైన భవన సదుపాయాలు, ఖాళీ స్థలాలు, తరగతి గదులు, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు.కేంద్రం నిర్వహణకు అవసరమైన సదుపాయాలు,చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులతో చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ........ గ్రామీణ యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి,వారికి ఉపాధి కల్పించడంతో పాటు సొంతంగా వ్యాపారాలు, వృత్తులు ప్రారంభించేలా ప్రోత్సహించడమే ఆర్‌ఎస్‌ఈటీఐ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.యువతకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన శిక్షణ అందించాలని సూచించారు. శిక్షణ పొందేందుకు వచ్చే వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.గ్రామీణ యువత శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించేలా శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, మహిళా శిశు వికాస కేంద్ర మేనేజర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.