బీరంగూడ గుట్టపై ఘనంగా రావణాసుర దహన మహోత్సవం
- భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు.. సింగర్ మౌనిక యాదవ్ పాటలతో హోరెత్తిన వేడుకలు!
- ముఖ్య అతిథులుగా కాటా శ్రీనివాస్ గౌడ్, కాటా సుధా శ్రీనివాస్ గౌడ్
సింగర్ మౌనిక యాదవ్ పాటలతో ప్రత్యేక ఆకర్షణ
ఈ మహోత్సవంలో ప్రముఖ సింగర్ మౌనిక యాదవ్ తన పాటలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె ఆలపించిన పాటలకు ప్రేక్షకుల నుంచి ఉత్సాహభరితమైన స్పందన లభించింది. రావణాసుర దహనంతో పాటు సంగీత కార్యక్రమం కూడా వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో బీరంగూడ గుట్టలో పండుగ వాతావరణం నెలకొంది.
కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, విజయదశమి చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, మానవత్వం, ఐకమత్యంతో ముందుకు సాగాలని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ వేడుకకు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయదశమి పర్వదినం ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, ఐకమత్యాన్ని అందించాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు బీరంగూడ దేవాలయ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగన్న గారి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రావణాసుర దహన మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఆహ్వానాలు అందించి, కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశారు. వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. రావణాసుర దహనం, సింగర్ మౌనిక యాదవ్ సంగీత ప్రదర్శనతో మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులు, ప్రజలు, సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
