- సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ కు వినతిపత్రం అందజేస్తున్న సెక్యూరిటీ గార్డులు.
రెబ్బెన,సాక్షర:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా బోనస్ లో జీఎస్టీ పేరుతో కట్ చేసిన135రూపాయలను తిరిగి చెల్లించాలని కోరుతూ బెల్లంపల్లి ఏరియాలో పని చేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు సోమవారం గోలేటిలోని ఏరియా జిఎం కార్యాలయంలో సెక్యూరిటీ ఆఫీసర్ దాసరి శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా బోనస్ కాంట్రాక్టు కార్మికులందరికీ దసరా పండుగకు చెల్లిస్తే తమకు మాత్రం పండగ తర్వాత రెండు రోజులకు చెల్లించారని అన్నారు.తమకు తెలియకుండా జీఎస్టీ పేరుతో కట్ చేసిన రూపాయలను తిరిగి చెల్లించాలన్నారు.గతంలో రెండుసార్లు ఇచ్చిన లాభాల వాటా బోనస్ లో జీఎస్టీ కట్ చేయలేదని ఈ సంవత్సరం తమకు తెలియకుండా జీఎస్టీ కట్ చేశారన్నారు.అసలే జీతాలు తక్కువని ఇచ్చిన 5500 లాభాల వాటా కూడా మరింత తక్కువ అందులో జీఎస్టీ పేరుతో కట్ చేయడం మమ్ములను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై సెక్యూరిటీ ఆఫీసర్ దాసరి శ్రీధర్ సానుకూలంగా స్పందించి జిఎస్టి పేరుతో కట్ చేసిన డబ్బులు ఇప్పించుటకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు.కార్యక్రమంలో సెక్యూరిటీ గార్డులు బి.రాజశేఖర్,కే.కేశవ్,బోనాల మల్లేష్,శ్రీనివాస్ గౌడ్,మేకల మల్లేష్,జంగు, శంకర్,సిహెచ్ తిరుపతి, ఆర్.గణపతి,లక్ష్మణ్,పి.భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER