శ్రీనివాస్ నగర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పీఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలు.. ఉత్తమ బతుకమ్మలకు వెండి పాత్రల బహుమతులు
మొదటి బహుమతి: శారద — 6 తులాల వెండి పాత్ర
రెండో బహుమతి: రేణుక — 4 తులాల వెండి పాత్ర
మూడో బహుమతి: ప్రమీల — 2 తులాల వెండి పాత్ర
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జరుపుకోవాలని తెలిపారు. ఇలాంటి వేడుకలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళలు, కాలనీవాసులు, పీఎన్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
