📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సిద్దులకుంట ఉన్నత పాఠశాల

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సిద్దులకుంట ఉన్నత పాఠశాల
  • మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు
నిర్మల్ నవంబర్ 11 సాక్షర ప్రతినిధి. సోన్ మండల పరిధిలోని సిద్దులకుంట గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ విద్యా దినోత్సవాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముందుగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు బానాల నరేందర్‌తో పాటు విద్యార్థినులు మిన్ను, మనోజ్ఞ జాతీయ విద్యా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి, దేశ ప్రగతి సాధ్యమవుతాయని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు భూమారెడ్డి, ఉపాధ్యాయులు కడారి దశరథ్, బద్దం సాయిరెడ్డి, మూర్తుజా ఖాన్, నరేందర్, సౌజన్య, స్కావెంజర్ మల్లేశ్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.