📅 Thursday, 12 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
29°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS నేటి విద్యార్థులే రేపటి భారత దేశ భవిష్యత్తు. విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ,పట్టుదల అవసరం.
‹
›
District News

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక అవార్డు పొందిన వికలాంగ విద్యార్థులు, వికలాంగ ఉద్యోగులకూ ప్రత్యేక అవార్డులు

◉ T PRAKASH RAO   |   ◷ Latest
నిజామాబాద్ ప్రతినిధి, సాక్షర : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మక అవార్డు పొందిన వికలాంగ విద్యార్థులు, వికలాంగ ఉద్యోగులు, అలాగే వికలాంగుల ఉన్నతి కోసం పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థలు, ఇతర అసోసియేషన్లు కానీ వికలాంగుల కోసం సాంకేతికంగా పాటు పడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక అవార్డుతో సత్కరించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు, వికలాంగుల సంక్షేమ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఒక ప్రకటన తెలిపారు. ఈ అవార్డు కోసం తమ సేవ సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డు పొందిన వికలాంగ విద్యార్థులు వికలాంగ ఉద్యోగులు తమ తమ ధ్రువ పత్రాలతో పాటు ప్రశంస పత్రాలను జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ఈనెల 16వ తేదీ లోగా సమర్పించవలసిందిగా జిల్లా సంక్షేమాధికారిని డి సౌమ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం, అలాగే దరఖాస్తు ఫారం కోసం depwdsctgp.telangana.gov.in సంప్రదించాలని జిల్లా సంక్షేమ అధికారిని కోరారు.