📅 Tuesday, 24 November 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
22°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS శ్రీ గురునానక్ దేవ్ జి బోధనలు అనుసరనీయం - సన్మార్గంలో నడచు కోవాలి - సత్యమార్గంలో జీవించాలి
‹
›
District News

బైపాస్ రోడ్డు నాసిరకం పనులపై విచారణ జరిపించాలి ​ బిల్లులు నిలిపివేసి, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్ చేయాలి

◉ Kodishetti Sathish   |   ◷ Latest
బైపాస్ రోడ్డు నాసిరకం పనులపై విచారణ జరిపించాలి
​

బిల్లులు నిలిపివేసి, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్ చేయాలి
  • మున్సిపల్ కమిషనర్‌ను అడుగుతున్నా ముత్యాల రవి కుమార్ గౌడ్
చెన్నూర్ సాక్షర :
చెన్నూర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా పనులు చేపట్టారని, సదరు కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముత్యాల రవి కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే పగుళ్లు ఏర్పడటం పనుల నాణ్యతకు అద్దం పడుతోందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారుఅధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, కమీషన్ల వ్యవహారాల వల్లే కాంట్రాక్టర్ నాణ్యతను గాలికి వదిలేశారనే ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయని, దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించి సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. బైపాస్ రోడ్డు నిర్మాణంలోనే ఇన్ని లోపాలు ఉంటే, రాబోయే పుష్కరాల కోసం ఖర్చు చేసే కోట్లాది రూపాయల నిధుల వినియోగంపై ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుందని ప్రశ్నించారు. ప్రజాధనం ఎవరి సొత్తు కాదని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
​ప్రధాన డిమాండ్లు:
​నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులను తక్షణమే నిలిపివేయాలి.
​మున్సిపల్ అధికారులతో కాకుండా స్వతంత్ర క్వాలిటీ కంట్రోల్ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, నమూనాలను ప్రభుత్వ ల్యాబ్‌లో పరీక్షించాలి.నాణ్యతా లోపాలు, కమీషన్ల ఆరోపణలపై నిజానిజాలు తేల్చి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి.దెబ్బతిన్న రోడ్డును సదరు కాంట్రాక్టర్ సొంత ఖర్చుతో నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తిరిగి నిర్మించేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు