📅 Saturday, 24 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
⛅
24°C Adilabad, Telangana
Partly cloudy
⚡ MORE NEWS బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమాన
‹
›
District News

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి: ఈర్ల రాజు ముదిరాజ్

◉ Vukkalkar Vivek   |   ◷ Latest
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి: ఈర్ల రాజు ముదిరాజ్
  • దసరా సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక సాయం అందజేత
  • కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా.. బీరంగూడ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు
అమీన్‌పూర్: పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని బీరంగూడ డివిజన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ తెలిపారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని అమీన్‌పూర్, బీరంగూడ డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈర్ల రాజు ముదిరాజ్ కార్మికులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, పండుగ కానుకగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో జీవిస్తున్నారంటే అందులో కార్మికుల కష్టం, అంకితభావం ఎంతో ఉందని పేర్కొన్నారు. వారి సేవలను సమాజం గుర్తించి తగిన గౌరవం ఇవ్వాలని అన్నారు.
పండుగల సమయంలో ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలనే ఉద్దేశంతో తన వంతుగా కార్మికులకు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదని, కార్మికుల పట్ల తనకున్న గౌరవం, ఆప్యాయతలకు ప్రతీక అని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ప్రాధాన్యతనిస్తూ, కుంభమేళా సందర్భంగా వారి పాదాలు కడిగి గౌరవించిన విషయాన్ని ఈర్ల రాజు ముదిరాజ్ గుర్తుచేశారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు గౌరవం, సంక్షేమ ఫలాలు అందాలనే అంత్యోదయ స్ఫూర్తితో బీజేపీ పనిచేస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ పారిశుద్ధ్య కార్మికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియడం సమాజం బాధ్యతని, వారి శ్రమను గుర్తించి గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పేర్కొన్నారు. కార్మికుల పట్ల గౌరవం, ఆప్యాయత చాటుతూ పండుగ సందర్భంగా ఆర్థిక సహాయం అందించిన ఈర్ల రాజు ముదిరాజ్‌ను పారిశుద్ధ్య కార్మికులు అభినందించారు.