నగరంలో దీపావళి పర్వదినం సందడి - లక్ష్మీ పూజలకు వ్యాపారుల ఏర్పాట్లు నూతన ఖాతా పుస్తకాల కొనుగోలు
దీపావళి పర్వదినం హిందువులందరికీ పెద్ద పండుగ అయితే వ్యాపార సంస్థలకు మాత్రం మరింత ప్రత్యేకమైనది సాంప్రదాయ బద్దంగా వ్యాపారస్తులు దీపావళి పండుగ పురస్కరించుకొని తమ వ్యాపార సంస్థల్లో సాంప్రదాయంగా లక్ష్మీ సంప్రదాయ పూజలు నిర్వహించి ప్రాంగణాల్లో భారీ ఎత్తున దీపాలు వెలిగించి పటాకులు కాల్చి చేయడం జరుగుతుంది అందులో భాగంగానే తమ వ్యాపార సంస్థలకు సంబంధించి నూతన ఖాతా పుస్తకాలు ప్రారంభించడం కూడా ఒక ప్రధాన ఘట్టం లక్ష్మీ పూజలు చేసిన రోజు వ్యాపారస్తులు తమ వ్యాపార సంస్థకు సంబంధించిన లావాదేవీల ఖాతా పుస్తకాలను ప్రారంభించడం జరుగుతుంది శుక్రవారం నగరంలో గాంధీ చౌక్ మార్గంలో కొందరు వ్యాపారులు నూతన ఖాతా పుస్తకాలను కొనుగోలు చేయడంతో సందడిగా మారింది ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు మాట్లాడుతూ తాము ప్రత్యేక నూతన ఖాతా పుస్తకాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు
