📅 Monday, 26 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☀
26°C Adilabad, Telangana
Clear sky
⚡ MORE NEWS బాసర ట్రిపుల్ ఐటీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు.
‹
›
District News

సోన్ మండల పుష్కర ఘాట్‌ల అభివృద్ధికి రూ.3.72 కోట్ల నిధులు మంజూరు

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
సోన్ మండల పుష్కర ఘాట్‌ల అభివృద్ధికి రూ.3.72 కోట్ల నిధులు మంజూరు
  • గోదావరి పుష్కరాల నేపథ్యంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం.. నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు
నిర్మల్, అక్టోబర్ 26 (సాక్షర ప్రతినిధి):
రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా సోన్ మండల పరిధిలోని పుష్కర ఘాట్‌లకు వెళ్లే రహదారుల అభివృద్ధి, పునరుద్ధరణ పనుల కోసం మొత్తం రూ.3.72 కోట్ల నిధులు మంజూరైనట్లు సోన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొయినుద్దీన్ తెలిపారు.ప్రభుత్వ ఉత్తర్వులు నంబర్ 582, అక్టోబర్ 22 ప్రకారం గోదావరి పుష్కరాల టైర్‌-2 శాశ్వత అభివృద్ధి పనుల్లో భాగంగా సోన్ మండల పరిధిలోని పలు రహదారులకు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.
నిధుల కేటాయింపు వివరాలు: 91 లక్షలు: సోన్ బస్‌స్టాండ్ నుంచి మెండోరా మండల పరిధిలోని స్వామి మఠం మీదుగా పుష్కర ఘాట్‌-1 వరకు రహదారి పునరుద్ధరణ పనులకు.1 కోటి: సోన్ గ్రామ ప్రవేశ ద్వారం నుంచి పాత బ్రిడ్జి మీదుగా పుష్కర ఘాట్‌-1 వరకు రహదారి నిర్మాణానికి.80 లక్షలు: జాతీయ రహదారి (NH-44) నుంచి సోన్ గ్రామంలోని పుష్కర ఘాట్‌-2 వరకు రహదారి పునరుద్ధరణకు.38 లక్షలు: సోన్ గ్రామ పంచాయతీ భవనం నుంచి స్వామి మఠం మీదుగా పుష్కర ఘాట్‌-1 వరకు రహదారి పునరుద్ధరణకు.63 లక్షలు: సోన్ మండలంలోని ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి కూచన్‌పల్లి గ్రామం వరకు రహదారి పునరుద్ధరణకు.ఈ సందర్భంగా మొయినుద్దీన్ మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో సోన్ మండలంలోని పుష్కర ఘాట్‌లకు వెళ్లే రహదారులు అభివృద్ధి చెంది భక్తులకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.అభివృద్ధి పనులకు నిధుల మంజూరులో ప్రత్యేక చొరవ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరి రావుకు సోన్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారూ.