చెన్నూరులో సుందరీకరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం
చెన్నూరు నియోజకవర్గంలో కార్మిక, మైనింగ్ శాఖలమంత్రిగడ్డం వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించి, పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
పట్టణ ప్రగతిలో భాగంగా రూ. 5.50 కోట్ల నిధులతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ పనులకు మంత్రి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగాఆయనమాట్లాడుతూ, చెన్నూరు పట్టణాన్నిఅన్నిరంగాల్లో సుందరంగా, సకల వసతులతో తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లురాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగామహంకాళి వాడ నుండి నేషనల్ హైవే వరకు రూ. 3.50 కోట్లతో చేపడుతున్న రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.పుష్కర ఘాట్లకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా గోదావరి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
పుష్కరాల కోసం శాశ్వత మౌలిక వసతుల కల్పన, ఘాట్ల విస్తరణ పనుల నిమిత్తం ప్రభుత్వం ద్వారా సుమారు రూ. 70 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారునాణ్యతాప్రమాణాలు తప్పనిసరినిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడకూడదని మంత్రి స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధితఅధికారులు,కాంట్రాక్టర్లను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,స్థానికప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
