బాంబే కాలనీలో కలుషిత నీటి సమస్యపై క్షేత్రస్థాయి పరిశీలన
- డ్రైనేజీ నీరు తాగునీటి పైప్‌లైన్‌లో కలుస్తున్నట్లు గుర్తింపు
- సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. అధికారులకు జలమండలి ఈడీ ఆదేశాలు
అనంతరం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని పాత రామచంద్రపురంలో జరుగుతున్న రెండు నీటి మరమ్మతు పనులను, వాసవి నగర్ కాలనీలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) సమస్యను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలుషిత నీటి సరఫరా వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున అధికారులు తక్షణమే స్పందించాలని నాయకులు సూచించారు. పైప్‌లైన్‌లోని లోపాలను సరిచేసి, నీటి సరఫరా వ్యవస్థను సురక్షితంగా పునరుద్ధరించడంతో పాటు, యూజీడీ సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ఈ పర్యటనలో జలమండలి డీజీఎం శివకుమార్, ఏఈ ధనుంజయ్ నాయక్ తదితర అధికారులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగన్నాధ్ రెడ్డి, పరమేష్ యాదవ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
