బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ నాయకులు.
- మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరి రావు
నిర్మల్ పట్టణంలోని ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీహరి రావు సోమవారం పరామర్శించారు. పట్టణంలోని డ్యాగవాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అరే చిరంజీవి తల్లి పోసాని, ముడారపు సోమేశ్ తండ్రి ముడారపు ప్రసాద్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న వారు, బాధిత కుటుంబాల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కౌన్సిలర్లు పెండం శ్రీనివాస్, నాందేడపు చిన్ను, సారంగాపూర్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ హాది, కో-ఆప్షన్ సభ్యుడు గాజుల రవి, దేవరకోట డైరెక్టర్ ముడారపు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు అడప శ్రీకాంత్, కిషోర్, శివ తదితరులు పాల్గొన్నారు.
