జన్నారం సాక్షర :జన్నారం మండలంలోని ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది విదినిర్వహణలో సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాదికారి నరేందర్ రాథోడ్ అన్నారు. శుక్రవారం రోజున మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని అయన సందర్శించారు. ఈ సందర్బంగా ప్రజలకు అందుతున్న సేవలు ఆసుపత్రిలో సౌకర్యాలు రికార్డులు సిబ్బంది హాజరు తదితర విషయాలను అయన తనికి చేశారు. ప్రజల సౌకర్యార్థం ప్రజలకు ఎటువంటి వైద్య ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఆరోగ్యశాఖ నిబందనల ప్రకారం మండలంలోని ప్రతి గ్రామంలోని ప్రజలకు వైద్యశిభిరాలు ఏర్పాటుచేసి మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అదేవిదంగా ప్రతి గ్రామంలో ఆయా గ్రామాల పరిదిలోని ప్రభుత్వ సిబ్బంది ప్రజాప్రతినిదుల సహకారాలు తీసుకోవాలని అయన సూచించారు. గ్రామాలలో సీజనల్ వ్యాదులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయన తెలిపారు. ఆయనవెంట మండల ప్రభుత్వ వైద్యాదికారిని డాక్టర్ ఉమశ్రి సిబ్బంది తదితరులు వున్నారు.
— Kotha VenugopalDistrict Correspondent