- కేక్ కట్ చేస్తున్న డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క.
రెబ్బెన,సాక్షర:రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.వేడుకలకు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు,కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు.అనంతరం నాయకులు,కార్యకర్తలు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ,టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం,అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని అన్నారు.ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు,రైతు సంక్షేమం,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని,రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కేసరి కిషన్ గౌడ్,జిల్లా కార్యవర్గ సభ్యులు సోమశేఖర్,దుర్గం దేవాజి,టౌన్ అధ్యక్షుడు దుర్గం రాజేష్,మండల ఉపాధ్యక్షులు బలరాం నాయక్,ఎస్సీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జాడి ప్రసాద్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు గోపాల్ నాయక్,సీనియర్ నాయకులు,మహిళా నాయకురాళ్లు,యువజన కాంగ్రెస్ నాయకులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
— M VIJAYAREBBENA REPORTER