- నవంబర్ 14న టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో గురుశ్రేష్ఠ అవార్డుల ప్రదానోత్సవం
నిర్మల్, అక్టోబర్ 27 (సాక్షర ప్రతినిధి):నిర్మల్ జిల్లాలో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం (TRSMA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న గురుశ్రేష్ఠ అవార్డుల ప్రదానోత్సవానికి బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నిర్వాహకులు ఆహ్వానం అందజేశారు.నవంబర్ 14, 2026న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గురుశ్రేష్ఠ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి, వారి సేవలను గౌరవించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ప్రోత్సహించడం, వారి సేవలను సమాజానికి పరిచయం చేయడం ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
— ARUGULA POSHETTYNirmal Dist Staffer