📅 Tuesday, 27 October 2026   |   📍 Hyderabad, Telangana, India
Saakshara
▣   ePaper
☁
30°C Adilabad, Telangana
Overcast
⚡ MORE NEWS నాలుగు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలి
‹
›
District News

.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

◉ ARUGULA POSHETTY   |   ◷ Latest
.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • నిమ్స్‌లో చికిత్స పొందుతున్న గుండంపల్లి గ్రామానికి చెందిన గీతాంజలి కుటుంబానికి ఆర్థిక సాయం
నిర్మల్, అక్టోబర్ 27 (సాక్షర ప్రతినిధి):అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. దిలావార్పూర్ మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన గట్ల గీతాంజలి కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన .2 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) చెక్కును బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు.అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మెరుగైన వైద్యం పొందేందుకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడనుంది. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, వైద్య ఖర్చుల కోసం రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.