నాలుగు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలి
- పెండింగ్ అనుమతులు మంజూరు చేసి, రాష్ట్ర వాటా నిధులతో పాటు అదనపు నిధులు విడుదల చేయాలి: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిజామాబాద్ ఎంపి అరవింద్ మరియు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గపాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నాలుగు లేన్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తొలుత సరైన అంచనాలు రూపొందించకపోవడం వల్లే నిర్మాణ పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయని విమర్శించారు. సవరించిన అంచనాల ప్రకారం పెరిగిన నిర్మాణ వ్యయానికి తక్షణమే పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధుల విడుదలలో జాప్యం చేయడం సరికాదని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న అనుమతులను వెంటనే మంజూరు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను సకాలంలో విడుదల చేయాలని తేలియజేశారు.. నిర్మాణ పనులను వేగవంతం చేసి, రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
